శ్రీశైల దేవస్థానం:
ప్రతీ నెలలోనూ ఒకరోజున చెంచు గిరిజనులకు ప్రత్యేకంగా ఉచిత స్పర్శదర్శనం కల్పించాలని నిర్ణయించినందున
చివరి బుధవారం రోజున చెంచు గిరిజన భక్తులకు ఈ ఉచిత స్పర్శదర్శనాన్ని కల్పించారు.
ఈ రోజు చెంచు భక్తులు శ్రీస్వామివార్ల స్పర్శదర్శనం ఉచితంగా దర్శించుకున్నారు.
చెంచు గిరిజనులు ఈ రోజు స్వామివార్ల స్పర్శదర్శనం, అమ్మవారిని దర్శించుకోవడం విశేషం.
స్థానిక చెంచుగూడెములతో పాటు మార్కాపురం జిల్లాలోని 315 మంది, నంద్యాల జిల్లా నుంచి 120 మంది, పల్నాడు జిల్లా నుంచి 175 మంది చెంచు భక్తులు ఈ రోజు స్పర్శదర్శనాన్ని చేసుకున్నారు.
దర్శనానంతరం చెంచు భక్తులందరికీ దేవస్థాన అన్నపూర్ణా ప్రసాద వితరణ భవనంలో అన్నప్రసాదాలు ఏర్పాటు చేశారు.
ఈ రోజు ఉదయం చెంచు గిరిజన భక్తులు సంప్రదాయబద్దంగా తప్పెట వాయిద్యాలతో, చెంచు నృత్యాలతో దర్శనానికి విచ్చేశారు. ఉమారామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద సిబ్బంది ఆహ్వానం పలికారు.
ఈ కార్యక్రమములో ధర్మకర్తల మండలి సభ్యురాలు శ్రీమతి జి. గంగమ్మ కూడా పాల్గొన్నారు.
శ్రీస్వామివారి ఉచిత స్పర్శదర్శనానికి చెంచు గిరిజన భక్తులను ఎంపిక చేయడంలో స్థానిక ఐ.టి.డి.ఏ ప్రాజెక్టు అధికారి వారి సహకారాన్ని తీసుకున్నారు
