శ్రీశైల దేవస్థానం: మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు దంపతులు, ఒంగోలు ఈ రోజు కుటుంబ సభ్యులతో కలిసి బంగారు గాజులు సమర్పించారు. బంగారు గాజుల మొత్తం బరువు 186 గ్రాములు. వీటి విలువ సుమారు రూ. 27 లక్షలకు పైగా ఉంటుందని దాతలు తెలిపారు.
బంగారు గాజులతో పాటు దేవస్థాన నిత్యప్రసాద వితరణ పథకానికి రూ. 3 లక్షల నగదును కూడా వీరు దేవస్థానానికి అందించారు.
బంగారు గాజులను, అన్నప్రసాద వితరణ విరాళం మొత్తాన్ని అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావుకు అందజేశారు.
కార్యక్రమములో స్వామివార్ల ప్రధానార్చకులు హెచ్. వీరయ్యస్వామి, అమ్మవారి ఆలయ ప్రధానార్చకులు యం. శ్రీధర్ శర్మ తదితర సిబ్బంది పాల్గొన్నారు.
అనంతరం దాత సిద్ధారాఘవరావు, శ్రీమతి లక్ష్మీపద్మావతమ్మ దంపతులకు తగు రశీదులను అందజేసి వేదాశీర్వచనముతో పాటు శ్రీస్వామిఅమ్మవార్ల శేష వస్త్రాలు, ప్రసాదాలను అందించారు.
