
శ్రీశైల దేవస్థానం; *శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించుకున్న శ్రీశైల జగద్గురు పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ చెన్నసిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాస్వామివారు *మరో కార్యక్రమం
• హిందూ ధర్మప్రచారంలో భాగంగా చెంచుగూడెములలో ‘మా స్వామి మల్లన్న – మా చెంతకే’ కార్యక్రమాలు
• మార్కాపురం జిల్లాలోని చింతల చెంచుగూడెంలో సంప్రదాయబద్దంగా కార్యక్రమ నిర్వహణ
• సాయంకాలం దేవస్థాన ధర్మప్రచారం రథం ద్వారా శోభాయాత్ర
• చింతల చెంచుగూడెంలో శ్రీస్వామిఅమ్మవార్ల కల్యాణోత్సవం
హిందూ ధర్మప్రచారంలో భాగంగా పలు చెంచుగూడెములలో ‘మా స్వామి మల్లన్న – మా చెంతకే’ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఇందులో భాగంగా ఈ రోజు మార్కాపురం జిల్లా చింతల చెంచుగూడెంలో శోభాయాత్ర అనంతరం కల్యాణోత్సవం జరిగింది..
ఈ రోజు సాయంకాలం గం. 6.30లకు ముందుగా దేవస్థానం ధర్మప్రచారం ద్వారా శోభాయాత్ర తరువాత కల్యాణోత్సవం జరిగింది.
ఈ కార్యక్రమములో దేవస్థానం కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, స్థానిక ఐ.టి.డి.ఎ ఏ.పి.డి
కె.పి. నాయక్, ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీమతి గుల్ల గంగమ్మ, దేవస్థానం అధికారులు, సంబంధిత దేవస్థానం సిబ్బంది, ఐ.టి.డి.ఎ సిబ్బంది పాల్గొన్నారు.
కె.పి. నాయక్, ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీమతి గుల్ల గంగమ్మ, దేవస్థానం అధికారులు, సంబంధిత దేవస్థానం సిబ్బంది, ఐ.టి.డి.ఎ సిబ్బంది పాల్గొన్నారు.