శ్రీశైల దేవస్థానం:శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పెంచలకోన శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థాన వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఈ రోజు శ్రీశైల దేవస్థానం తరపున శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారికి , ఆదిలక్ష్మీ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
శ్రీశైల దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు, ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీమతి ఉప్పుటూరి సుబ్బలక్ష్మీ, ప్రత్యేక ఆహ్వానితులు వేమిరెడ్డి కోటారెడ్డి, ఆకుల శ్రీనివాసులు పట్టువస్త్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమములో ఆలయ విభాగపు సహాయ కార్యనిర్వహణాధికారి ఎం. హరిదాసు, అర్చక స్వాములు, వేదపండితులు తదితర సిబ్బంది పాల్గొన్నారు.
ఏప్రియల్ 27వ తేదీ నుంచి మే 3వ తేదీవరకు ఆ క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు వుంటాయి। ప్రతీ సంవత్సరము ఆయా ఉత్సవాల సందర్భంగా కాణిపాకం దేవస్థానం, విజయవాడ ఇంద్రకీలాద్రి, దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం, కొలనుభారతి సరస్వతీ అమ్మవారికి ఈ దేవస్థానం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు
