శ్రీశైల దేవస్థానం:దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) ఆదివారం అభినయరుద్ర నాట్యాలయ, ఖమ్మం సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేసింది.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం నుండి ఈ నృత్య ప్రదర్శన కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమములో ఓం నమశ్శివాయ, నమస్తే రుద్రరూపిణి, ఓం శివోహం, శివతాండవ స్తోత్రం శివోహం, అఖిలాండేశ్వరి తదితర గీతాలకు వైశాలి, ప్రజ్వల, ఆరాధ్య, గీతిక, ఆకాంక్ష, లక్ష్మి, ఉజ్వల తదితరులు నృత్య ప్రదర్శన చేసారు.
కాగా ఈ నిత్య కళారాధనలో ఆయా రోజులలో హరికథ, బుర్రకథ, సంప్రదాయ నృత్యం, వాయిద్య సంగీతం, భక్తిరంజని లాంటి కార్యక్రమాలు ఏర్పాటు అవుతున్నాయి.
శ్రీస్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని , ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ నిత్యకళారాధన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
