శ్రీశైల దేవస్థానం:
ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) ఆదివారం శివశక్తి కూచిపూడి ఆర్ట్స్ అకాడమీ, హైదరాబాద్ వారు సంప్రదాయ నృత్య ప్రదర్శన సమర్పించారు.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం నుండి ఈ సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమం లో గణపతి నృత్యం, మూషికవాహన, భో…శంబో శివశంభో, నమశ్శివాయతే, లింగాష్టకం, జయ జయ శంకరా తదితర గీతాలకు అక్షయశ్రీ, శ్యామల, పూర్ణసాధిక, త్రిపుర, సురభి తదితరులు నృత్య ప్రదర్శన చేశారు.
నిత్య కళారాధనలో ఆయా రోజులలో హరికథ, బుర్రకథ, సంప్రదాయ నృత్యం, వాయిద్య సంగీతం, భక్తిరంజని లాంటి కార్యక్రమాలు ఏర్పాటు అవుతున్నాయి.
శ్రీస్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని , ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ నిత్యకళారాధన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
