






శ్రీశైల దేవస్థానం:
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో పదవరోజైన మంగళవారం ఉదయం శ్రీ స్వామిఅమ్మవార్లకు విశేషపూజలు జరిగాయి. తరువాత శ్రీ స్వామివారి యాగశాల లో శ్రీ చండీశ్వరస్వామికి ప్రత్యేక పూజాదికాలు జరిపారు.రుద్రహోమం, చండీహోమం జరిపించారు.
తరువాత యాగ పూర్ణాహుతి, వసంతోత్సవం, అవబృథం, త్రిశూలస్నానం, కార్యక్రమాలు జరిగాయి.
పూర్ణాహుతి కార్యక్రమంలో శాస్త్రోక్తంగా నారికేళాలు, పలు సుగంధ ద్రవ్యాలు, ముత్యం, పగడం, నూతన వస్త్రాలు మొదలైన ద్రవ్యాలను హోమగుండంలోకి ఆహుతిగా సమర్పించి యాగ కార్యక్రమాన్ని పూర్తి చేసారు.
అనంతరం జరిగిన వసంతోత్సవంలో ఆలయ అర్చకులు, వేదపండితులు వసంతాన్ని (పసుపు, సున్నం కలిపిన మంత్ర పూరిత జలం) సమంత్రకంగా భక్తులపై ప్రోక్షించారు.
తరువాత జరిగిన అవబృథస్నానంలో చండీశ్వరస్వామికి ఆలయ పుష్కరిణి వద్ద ఆగమ శాస్త్రోక్తంగా స్నపన కార్యక్రమం నిర్వహించారు. చివరగా త్రిశూలస్నాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ పూర్ణాహుతి కార్యక్రమములో జిల్లా కలెక్టర్ శ్రీమతి జి. రాజకుమారి, ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు, కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చకస్వాములు, అధ్యాపక (స్థానాచార్యులు) వేదపండితులు తదితరులు పాల్గొన్నారు.
సదస్యం – నాగవల్లి:
మహాశివరాత్రిబ్రహ్మోత్సవాలలో భాగంగానే ఈ రోజు నిత్య కల్యాణ మండపంలో సదస్యం , నాగవల్లి కార్యక్రమాలు జరిగాయి. సదస్యం కార్యక్రమంలో వేదపండితులు చతుర్వేద పారాయణలతో, స్త్రోత్రాలతో శ్రీస్వామిఅమ్మవార్లను స్తుతించారు.
ఆ తరువాత నాగవల్లి కార్యక్రమంలో మహాశివరాత్రి రోజున కల్యాణోత్సవం జరిగిన శ్రీ భ్రమరాంబాదేవి వారికి ఆగమశాస్త్రం సంప్రదాయం మేరకు మెట్టెలు,నల్లపూసలు సమర్పించారు.
బుధవారంతో ముగియనున్న బ్రహ్మోత్సవాలు:
ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపటితో ముగియనున్నాయి. ఈ ఉత్సవాల ముగింపులో భాగంగా రేపు ఉదయం శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషపూజలు వుంటాయి. తరువాత రేపు సాయంకాలం శ్రీ స్వామివార్లకు అశ్వవాహనసేవ , ఆలయ ఉత్సవం నిర్వహిస్తారు. ఆలయ ఉత్సవం అనంతరం శ్రీస్వామిఅమ్మవార్లకు పుష్పోత్సవం, శయనోత్సవం నిర్వహిస్తారు. 

DATE: 17-02-2026
TIME: (4:30 AM TO 08:40 (PM) TEMPLE PILGRIMS COUNTING = 24,348
ANNADHNAM PEOPLE COUNTING = 5,212
TOTAl
COMPARTMENT STATUS =00
FREE COMPARTMENT=00
200 COMPARTMENTS = 00
500 COMPARTMENT (ALANKARAM) =00
FREE COMPARTMENTS PRASADAM =
DARSHANAM=
ALANKARA DARSHANAM
ధ్వజావరోహణ:
ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజు సాయంకాలం ధ్వజావరోహణ కార్యక్రమం ప్రత్యేకం.
ఈ ధ్వజావరోహణ కార్యక్రమంలో ఉత్సవాల మొదటిరోజున బ్రహ్మోత్సవ ప్రారంభ సూచకంగా ఆలయ ప్రధాన ధ్వజస్తంభంపై ఆవిష్కరింపజేసిన ధ్వజపటం అవరోహణ అయింది.
*ఓం నమ:శ్శివాయ🙏
DATE: 17-02-2026
TIME: (4:30 AM TO 10:06 (PM) TEMPLE PILGRIMS COUNTING = 25,290
ANNADHNAM PEOPLE COUNTING = 5,540
TOTAl
COMPARTMENT STATUS =00
FREE COMPARTMENT=00
200 COMPARTMENTS = 00
500 COMPARTMENT (ALANKARAM) =00
FREE COMPARTMENTS PRASADAM =
DARSHANAM=
Temple close
