శ్రీశైల దేవస్థానం:జనవరి 1వ తేదీన ఐచ్ఛిక సెలవు రోజు కారణంగా భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది.ఈ కారణంగా జనవరి 1న శ్రీ స్వామివార్ల స్పర్శదర్శనం పూర్తిగా నిలుపుదల చేస్తారు. ఆ రోజున భక్తులందరికీ కూడా కేవలం శ్రీస్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తారు. అదేవిధంగా ఆ రోజున ( 01.01.2025) శ్రీస్వామివారి ఆర్జిత గర్భాలయ అభిషేకాలు, ఆర్జిత సామూహిక అభిషేకాలు కూడా నిలుపుదల చేస్తారు. అలాగే ఉదయాస్తమానసేవ, ప్రాత:కాలసేవ, ప్రదోషకాలసేవలు కూడా ఆ రోజున నిలుపుదల చేస్తారు.
సర్వదర్శనం క్యూలైన్లలోని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు, భక్తులందరికీ కూడా త్వరితగతిన శ్రీస్వామివార్ల దర్శనం కల్పించేందుకు వీలుగా గతంలో వలనే ప్రస్తుతం కూడా ఈ నిర్ణయం తీసుకున్నారు.
కాగా క్యూకాంప్లెక్సులో వేచివున్న భక్తులకు సమయానుసారంగా మంచినీరు, అల్పాహారం అందిస్తారు.
అదేవిధంగా ఉదయం గం.10.30ల నుంచి అన్నప్రసాద భవనంలో అన్నప్రసాద వితరణ వుంటుంది.
దర్శనాలు ప్రారంభమైనప్పటి నుంచి భక్తులకు లడ్డు ప్రసాద విక్రయకేంద్రాలలో లడ్డు ప్రసాదాలు అందుబాటులో వుంటాయి.