
శ్రీశైల దేవస్థానం:ఈ నెల 25వ తేదీన సూర్యగ్రహణం కారణంగా ఆ రోజు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6.30 గంటల వరకు ఆలయ ద్వారాలు మూసివేస్తారు. 25వ తేది వేకువ జామున 3.00గంటలకు ఆలయ ద్వారాలు తెరచి ముందుగా మంగళ వాయిద్యాలు, తరువాత 3.30గంటలకు సుప్రభాతసేవ, 4.30గంటలకు శ్రీస్వామి అమ్మవార్ల మహా మంగళ హారతులు ఇస్తారు. తరువాత ఉదయం 6.00 గంటలకు ఆలయ ద్వారాలను మూసివేస్తారు.అదేరోజు సాయంత్రం 6.30గంటలకు ఆలయ ద్వారాలు తెరచిన తరువాత ఆలయ శుద్ది, మంగళ వాయిద్యాలు, సంప్రోక్షణ, ప్రదోషకాల పూజలు నిర్వహిస్తారు.అనంతరం రాత్రి 8.00గంటల నుంచి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఆ రోజు భక్తులకు శ్రీస్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తారు. ఆలయ ప్రాంగణంలోని పరివార ఆలయాలు , సాక్షిగణపతి, హఠకేశ్వరం, పాలధార – పంచధార , శిఖరేశ్వరం మొదలైన ఉపాలయ ద్వారాలను కూడా మూసివేసి గ్రహణం రోజున సాయంకాలం 6.30 గంటలకు ఆలయ ద్వారాలు తెరచి ఆలయశుద్ధి, సంప్రోక్షణ మొదలైన కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం సాయంకాల పూజాదికాలు చేస్తారు.
గ్రహణం కారణంగా 25వ తేదీన అన్ని ఆర్జిత సేవలు, శాశ్వత సేవలు, పరోక్షసేవలు నిలిపివేస్తారు.
25న అన్నప్రసాద వితరణ నిలుపుదల:
గ్రహణం కారణంగా 25వ తేదీన మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ కూడా నిలిపివేస్తారు. రాత్రి 8 గంటల నుంచి అల్పాహారం అందిస్తారు.