14 వ పాశురము
ఉజ్ఞ్గల్ పుళైక్కడై తోట్టత్తు వావియుల్
శెజ్ఞ్గళునీర్ వాయ్ నెగిలి న్దాంబల్ వాయ్ కూంబినకాణ్
శెజ్ఞ్గల్పొడిక్కూరై వెణ్ పల్ తవత్తవర్
తజ్ఞ్గల్ తిరుక్కోయిల్ శజ్ఞ్గిడువాన్ పోగిన్రార్
ఎజ్ఞ్గలై మున్న మెళుప్పువాన్ వాయ్ పేశుమ్
నజ్ఞ్గా యెలున్దిరాయ్ నాణాదాయ్ నావుడై యాయ్
శజ్ఞ్గొడు శక్కర మేన్దుమ్ తడక్కైయన్
పజ్ఞ్గయక్కణ్ణానై ప్పాడేలో రెమ్బావాయ్.
తాత్పర్యము: స్నానము చేయుటకు గోపికల నందరనులేపుదునని చెప్పి, నిద్రించుచున్న ఒకామెను మేల్కొలుపుచున్నారు .ఓ పరిపుర్ణురాలా ! నీ పెరటి తోటలో దిగుడుబావిలోని ఎర్రతామరాలు వికసించినవి. కలువలు ముడుచుకోపోతున్నవి లెమ్ము ! ఎర్రని కాషాయములను దాల్చి తెల్లని పల్ వరుసలు కలిగి వైరాగ్యముతో కూడిన సన్యాసులు తమతమ ఆలాయములలో ఆరాధన చేయుటకు పోతున్నారు లెమ్ము. మమ్ములను ముందుగానే మేల్కొని వచ్చి లేపుదనని మాట ఇచ్చావు మరచావా ?
ఓ లజ్జావిహీనురాలా లెమ్ము ! మాట నేర్పు కలదానా ! శంఖమును ,చక్రమును ధరించిన వాడును ,
ఆజానుబాహువు అయిన పుండరీకాక్షుని మహిమను గానము చేయుటకు రమ్ము.