
శ్రీశైల దేవస్థానం:స్వచ్ఛ ఆంధ్ర సేవా కార్యక్రమములో భాగంగా గురువారం క్షేత్ర పరిధిలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు.
ప్రతీ గురువారము క్షేత్ర పరిధిలో ఈ విస్తృత పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ రోజు జరిగిన స్వచ్ఛాంధ్ర సేవా కార్యక్రమములో క్షేత్రంలోని పలు ప్రదేశాలలో ప్రత్యేకంగా పారిశుద్ధ్య
పనులు చేశారు.
క్షేత్రంలోని పలు ప్రధాన రహదారులు, ఆరుబయలు ప్రదేశాలు మొదలైనచోట్ల ఈ పారిశుద్ధ్య కార్యక్రమం జరిపారు.
కాగా పారిశుద్ధ్య నిర్వహణకుగాను క్షేత్రాన్ని 6 జోన్లుగా, 11 సెక్టార్లుగా, 66 ప్రదేశాలుగా విభజించారు. పారిశుద్ధ్య కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు ప్రతీ జోనుకు కూడా దేవస్థానం యూనిట్ అధికారులను, పర్యవేక్షకులను ప్రత్యేక అధికారులుగా నియమించారు. అదేవిధంగా ఆయా జోన్లలో పలువురు సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించారు. దాదాపు అన్ని విభాగాల సిబ్బంది కూడా ఈ ప్రత్యేక విధులను కేటాయించారుఈ రోజు జరిగిన పారిశుద్ధ్య కార్యక్రమంలో పలు విభాగాల అధికారులు, సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు.