శ్రీశైల దేవస్థానం: దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన) గురువారం శ్రీ శారదా కళాక్షేత్ర కూచిపూడి డాన్సు అకాడమీ, హైదరాబాదు వారు సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పించారు.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం నుండి ఈ నృత్య ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమములో గణేశ పంచరత్న, ఓం నమశ్శివాయ, శివాష్టకం, శంభో..శివశంభో తదితర గీతాలకు, అష్టకాలకు అక్షర, హరిణి, సహస్ర, వర్షిత తదితరులు నృత్య ప్రదర్శన చేసారు.
కాగా ఈ నిత్య కళారాధనలో ఆయా రోజులలో హరికథ, బుర్రకథ, సంప్రదాయ నృత్యం, వాయిద్య సంగీతం, భక్తిరంజని లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
శ్రీస్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని , ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ నిత్యకళారాధన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
