*కె. పవన్ చైతన్య, హైదరాబాద్ ఈ రోజు శ్రీశైల దేవస్థానం అన్నప్రసాద వితరణ పథకానికి విరాళం రూ. 1,01,116/-లను అందజేశారు.. ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు కె. శివప్రసాదుకు అందజేశారు. దాతకు తగు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందించారు.
*శ్రీశైల దేవస్థానం:
నందీశ్వరస్వామివారికి విశేషపూజలు:
ఈ రోజు సాయంత్రానికి త్రయోదశి ఘడియలు రావడంతో నందీశ్వరస్వామి వారికి పరోక్షసేవగా విశేషార్చన జరిపించారు.
ప్రతీ మంగళవారం రోజున త్రయోదశి రోజులలో దేవస్థానసేవగా (సర్కారీసేవగా) ఈ కైంకర్యం వుంటుంది.
అయితే ప్రతి నెలలో కూడా త్రయోదశి రోజులలో శుద్ధ త్రయోదశి బహుళ త్రయోదశి రోజులలో భక్తులు నందీశ్వరస్వామివారి పూజను పరోక్షసేవగా జరిపించుకునే అవకాశం కూడా కల్పించారు.
కాగా ఈ రోజు మొత్తం 35 మంది భక్తులు పరోక్షసేవగా ఈ నందీశ్వరస్వామి విశేషపూజను జరిపించుకున్నారు.
ఈ పరోక్షసేవలో తెలుగురాష్ట్రాల నుంచే కాకుండా, కర్ణాటక, తమిళనాడు, ఒడిస్సా నుంచి కూడా భక్తులు ఈ విశేషపూజను నిర్వహించుకున్నారు.
ఈ విశేషార్చనలో ముందుగా లోకక్షేమాన్ని కాంక్షిస్తూ దేశం శాంతిసౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరిత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని, పాడి సమృద్ధిగా ఉండాలని, జనులకు ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాలమరణాలు రాకుండా ఉండాలని, దేశంలో అగ్నిప్రమాదాలు, వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, జనులందరూ సుఖశాంతులతో ఉండాలంటూ అర్చకస్వాములు, వేదపండితులు సంకల్పాన్ని చెప్పారు.
అనంతరం కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతి పూజను జరిపించారు.
ఆ తరువాత నందీశ్వరస్వామికి శాస్త్రోక్తంగా పంచామృతాలతోనూ, ఫలోదకాలతో హరిద్రోదకం, కుంకుమోదకం, గంధోదకం, భస్మోదకం, రుద్రాక్షోదకం, బిల్వోదకం, పుష్పోదకం, సువర్ణోదకం , మల్లికాగుండంలోని శుద్ధజలంతో అభిషేకం జరిపారు.. తరువాత నందీశ్వరస్వామికి అన్నాభిషేకం నిర్వహించారు.
వృషభసూక్తం మొదలైన వేదమంత్రాలతో శాస్త్రోక్తంగా ఈ విశేషాభిషేకాన్ని జరిపారు. తరువాత నందీశ్వరస్వామివారికి నూతన వస్త్ర సమర్పణ, విశేషపుష్పార్చనలను జరిపారు. అనంతరం నానబెట్టిన శనగలను నందీశ్వరస్వామికి సమర్పించారు.
కాగా త్రయోదశి రోజున నందీశ్వరస్వామివారి పరోక్షసేవకు భక్తులు ఆన్లైన్ ద్వారా రూ.1,116/-లను సేవా రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది.
భక్తులు సేవా రుసుమును www.srisailadevasthanam.org లేదా aptemples.ap.gov.in ద్వారా చెల్లింపు చేయవచ్చు.
నందీశ్వరస్వామివారి ఆరాధన వలన సంతానంలేనివారికి సంతానం కలుగుతుందని, సమస్యలు తొలగి సుఖసంతోషాలు కలుగుతాయని, ఋణ బాధలు తీరుతాయని, అనారోగ్యం తొలగి ఆరోగ్యం చేకూరుతుందని, కష్టాలు నివారించబడతాయని, మానసిక ప్రశాంతత చేకూరుతుందని పండితులు పేర్కొంటున్నారు.
అదేవిధంగా ఈ స్వామికి నానబెట్టినశనగలను సమర్పించడం వలన కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పబడుతోంది. అందుకే ఈ స్వామివారికి శనగలబసవన్న అనే పేరు కూడా ప్రసిద్దంగా ఉంది.
సేవాకర్తలేకాకుండా భక్తులందరు కూడా వీటిని శ్రీశైలటి.వి / యూ ట్యూబ్ ద్వారా వీక్షించవచ్చును.
భక్తులందరు కూడా ఈ పరోక్షసేవను సద్వినియోగం చేసుకోవాలని దేవస్థానం కోరింది.
ఇతర వివరా లకు దేవస్థానం సమాచార కేంద్ర ఫోన్ నంబర్లు 83339 01351 / 52 / 53 లను సంప్రదించవచ్చును.
*uyala seva performed in the temple,
