శ్రీశైల దేవస్థానం: ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) బుధవారం శ్రీ గిరిజా కూచిపూడి నాట్య అకాడమీ, మండపేట, తూర్పుగోదావరి జిల్లా వారు సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పించారు.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం నుండి ఈ నృత్య ప్రదర్శన కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమం లో వినాయకకౌత్వం, వందేశివం శంకరం, శివతాండవం, శంకర శివ శంకరా, అయిగిరినందిని తదితర గీతాలకు తులసి, భవానీ, శివశ్రీహరిణి, హైమ, చరణి, రూప, శిరీష, మోక్ష, అవంతిక, దివ్య, మధు, తదితరులు నృత్యప్రదర్శన చేసారు.
కాగా ఈ నిత్య కళారాధనలో ఆయా రోజులలో హరికథ, బుర్రకథ, సంప్రదాయ నృత్యం, వాయిద్య సంగీతం, భక్తిరంజని లాంటి కార్యక్రమాలు ఏర్పాటు అవుతున్నాయి.
శ్రీస్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని , ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ నిత్యకళారాధన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
