శ్రీశైల దేవస్థానం:
లోకకల్యాణం కోసం దేవస్థానం ఆదివారం రాత్రి శ్రీ స్వామిఅమ్మవార్లకు పల్లకీ ఉత్సవం జరిపింది.
పల్లకీ ఉత్సవం ప్రతి ఆదివారం, పౌర్ణమి ,మూలా నక్షత్రం రోజులలో దేవస్థాన సేవగా (సర్కారి సేవగా) నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా అమ్మవారి ఆలయ ఆశీర్వచన మండపంలో లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చక స్వాములు సేవాసంకల్పాన్ని తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజ జరిపారు.
అనంతరం శ్రీ స్వామిఅమ్మవార్ల ఉత్సవ మూర్తులను పల్లకీలో వేంచేబు చేయించి శాస్త్రోక్తంగా షోడశోపచార పూజలు జరిపారు
