శ్రీశైల దేవస్థానం:
ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) శనివారం శ్రీమతి జావని వనిత , వారి బృందం, సికిందరాబాద్ సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పించారు.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్య కళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం నుండి ఈ నృత్య ప్రదర్శన కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమం లో గణపతి కౌత్వం,శివాష్టకం, భో…శంభో, జతిస్వరం, లింగాష్టకం, శంభో..శివశంభో, నమశ్శివాయతే తదితర గీతాలకు పల్లవి, ఎస్ పూజ, వైష్ణవి తదితరులు నృత్యప్రదర్శన చేసారు.
ఈ నిత్య కళారాధనలో ఆయా రోజులలో హరికథ, బుర్రకథ, సంప్రదాయ నృత్యం, వాయిద్య సంగీతం, భక్తిరంజని లాంటి కార్యక్రమాలు ఏర్పాటు అవుతున్నాయి.
శ్రీస్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని , ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ నిత్యకళారాధన కార్యక్రమాలు జరుగుతున్నాయి.
