శ్రీశైల దేవస్థానం: గురువారం జరిగిన హుండీల లెక్కింపు ద్వారా దేవస్థానానికి రూ.4,83,22,554/- లు నగదు రాబడిగా లభించిందని ఈ ఓ తెలిపారు.కాగా ఈ హుండీల రాబడిని భక్తులు గత 33 రోజులలో (21.03.2026 నుండి 22.04.2026 వరకు) సమర్పించారు. ఈ హుండీలో 162 గ్రాముల 200మిల్లీగ్రాముల బంగారు, 4కేజీల180 గ్రాముల వెండి లభించాయి.
అదేవిధంగా 144 – యుఎస్ఏ డాలర్లు, 9870 – శ్రీలంక రూపి, 90 – యు.ఎ.ఇ దిర్హమ్స్, 120 – సౌదీరియాల్స్, 20 – ఇంగ్లాండు పౌండ్స్ , 151 – మలేషియా రింగిట్స్ , 25– ఆస్ట్రేలియా డాలర్లు, 30 – యూరోలు, 25– కెనడా డాలర్లు, 1 – కువైట్ దినార్, 30 – న్యూజిలాండ్ డాలర్లు మొదలైనవి ఈ హుండీల లెక్కింపులో లభించాయి.
హుండీల లెక్కింపును కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు పర్యవేక్షించారు.
ఈ కార్యక్రమములో పలువిభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు హుండీ లెక్కింపు పర్యవేక్షణలో పాల్గొన్నారు. హుండీల లెక్కింపులో సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు.
