శ్రీశైల దేవస్థానం:దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్య కళారాధన కార్యక్రమం) మంగళవారం శ్రీ దీవి హయగ్రీవాచార్యులు, నంద్యాల , ఆదిశంకరాచార్యుల జీవిత చరిత్ర పై ప్రవచనం చేశారు.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం నుండి ఈ ప్రవచన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
రెండవ కార్యక్రమం లో భాగంగా శ్రీ భ్రమరాంబా నృత్యకళాశాల, నందికొట్కూరు సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పించారు.
ఈ కార్యక్రమం లో మహాగణపతిం, సిద్ధివినాయక, మూషికవాహన, శ్రీశైలగిరివాసా తదితర గీతాలకు బ్రాహ్మిణి, భవ్య, జ్యోతి, మోహనశ్రీ, కల్యాణి, నందిని, వెంకటపద్మ తదితరులు నృత్య ప్రదర్శన చేసారు.
కాగా ఈ నిత్య కళారాధనలో ఆయా రోజులలో హరికథ, బుర్రకథ, సంప్రదాయ నృత్యం, వాయిద్య సంగీతం, భక్తిరంజని లాంటి కార్యక్రమాలు ఏర్పాటు అవుతున్నాయి.
శ్రీస్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని, ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ నిత్యకళారాధన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

