శ్రీశైల దేవస్థానం:
దేవస్థానం నిర్వహిస్తున్న వీరశైవ ఆగమ పాఠశాల ప్రవేశ పరీక్ష ఈ రోజు జరిగింది. చంద్రవతి కల్యాణ మండపములో ఈ పరీక్షను నిర్వహించారు.
వీరశైవ ఆగమ కోర్సులో ప్రవేశానికి ఈ పరీక్షను నిర్వహించారు. ఈ రోజు జరిగిన ప్రవేశ పరీక్షకు మొత్తం 25 మంది అభ్యర్ధుల దరఖాస్తు చేసుకోగా 22 మంది పరీక్షకు హాజరయ్యారు.హాజరైన వారందరూ ప్రవేశ అర్హతను పొందారు. కోర్సులో ప్రవేశ అర్హతను పొందిన వారి ధృవీకరణ పత్రాలు పరిశీలించారు.
ఈ ఆగమ కోర్సు కాల పరిమితి 6 సంవత్సరాలు. విద్యాభ్యాస సమయంలో విద్యార్థులందరికీ ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పిస్తారు.
ఈ పరీక్ష నిర్వహణలో స్వామివారి ఆలయ ఉప ప్రధానార్చకులు , ఆగమ పాఠశాల ప్రిన్సిపాల్ ఎం.శివశంకరయ్య స్వామి, సహాయ కార్యనిర్వహణాధికారి జి.స్వాములు, పాఠశాల పర్యవేక్షకులు డి.రంగన్న, సంబంధిత గుమాస్తా , పాఠశాల వార్డన్ జి.శ్రీనివాసులు, ఆగమ పండితులు ఎం.శివయ్య, ఆంగ్ల ఉపాధ్యాయులు డి. లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
