హైదరాబాద్:ఫ్లోరైడ్ భూతానికి బలైన నల్లగొండ ప్రాంతం నుండి స్విట్జర్లాండ్ లోని ”స్విస్ ఫెడరల్ యూనివర్సిటీ “ జూరిష్ లో చదివిన యువ సైంటిస్ట్ డా|| శ్రీనివాస్ కనిపెట్టిన వాటర్ ఫ్యూరిపైర్ ను మీడీయా ఆకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఆవిష్కరించారు. ప్రఖ్యాత శాస్త్రవెత్త ఐన్ స్టీన్ చదివిన యూనివర్సిటీలో మన తెలుగు తేజం సీటు సంపాదించిన శ్రీనివాస్ కు గొప్ప భవిష్యత్తు వుందని అన్నారు.
ప్రస్తుతం వాడుకలో ఆర్.ఓ.ఆర్.లో 50% నీరు వృధా అవుతుందని, నీటిలోని మినరల్స్ పోయి నీరు చచ్చుపడుతుందని యువ శాస్త్రవెత్త అన్నారు. సుప్రీమ్ కోర్ట్ కూడా ఆర్.ఓ.ఆర్. వాడకం ప్రతి బందించిందని అన్నారు. హైదరాబాదు లోని ఎన్.జీ.ఆర్. ఐ. పరిశోధానా సంస్థ ఈ పరికరాన్ని పరిశీలించి దీని నుండి వచ్చే నీరు స్వచ్చ మైనదని తెలిపిందని, ఆ సంస్థ సైంటిస్ట్ డా|| రామ్మోహన్ చెప్థూ దీనికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి కూడావుందని తెలిపారు.