తెలంగాణ ప్రభుత్వం పనితీరు భేష్!! చాల బాధ్యతగా ప్రజలకు అండగా నిలిచిన మంత్రులు, అధికారులు, పోలీస్ సిబ్బంది
ఎప్పటికప్పుడు పరిస్థిని సమీక్షించి ఎంతో బాధ్యతతో బాధిత ప్రాంతాల్లో రాత్రి పగలు అని లేకుండా మంత్రులు అధికారులు సహకారంతో పర్యవేక్షిస్తూ తగిన సహాయం అందిస్తూ, శిథిల భవనాలను కూల్చివేయడం, బాధితులను సహాయ కేంద్రాలకు తరలించి భోజనాలు, తాగునీటి వసతులు కల్పించడం,అర్ధరాత్రి వరకు సమీక్షలు, మొదలగు చర్యలతో ప్రజలకు అండగా నిలిచిన సర్కార్.
మంత్రులు, అధికారులు, హైదరాబాద్ మేయర్, జిహ్ఎంసి కమీషనర్ మరియి సిబ్బంది, హైదేరాబద్ సిటీ పోలీస్ యంత్రాంగం ఎప్పటికప్పుడు అందించిన సహకారం వెలకట్టలేనిది. హైదరాబాద్ పోలీసులు ఎంతగానో శ్రమించారు . అకాలంగా కురిసిన అతి పెద్ద వర్షం నగరాన్ని ముంచెత్తినా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరుగకుండా చర్యలు చేపట్టడంలో తెలంగాణ ప్రభుత్వం విజయం సాధించింది.
పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహా మంత్రులు, ఉన్నతాధికారులంతా ఆపరేషన్ రెయిన్ చేపట్టి రేయింబవళ్లు సహాయ చర్యల్లో పాల్గొనడం, ఇబ్బందుల్లో ఉన్న ప్రజల్లో మనోధైర్యాన్ని నింపడం బాధితులకు భరోసా వచ్చింది. ఇదీ ప్రభుత్వమంటే..! అధికారుల పనితీరు ప్రశంసనీయం