
నంద్యాల జిల్లా;
* శ్రీశైలంలో ప్రశాంతంగా స్వామి, అమ్మవార్ల దర్శనాలు అవుతున్నాయి-నంద్యాల SP సునీల్ షొరాణ్
* దేవస్థాన కమాండ్ కంట్రోల్ నుంచి నిరంతరం పర్యవేక్షణ.
* భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ప్రశాంతంగా దర్శన ఏర్పాట్లు.
* నిన్న సుమారు 84,000 భక్తులు స్వామి అమ్మవారిని దర్శనం చేసుకున్న భక్తులు వీరిలో 32,543 శివ స్వాములు ఉన్నారు. వీరందరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శనం కల్పించారు.
* అటవీమార్గం ద్వారా (కైలాష్ మార్గంలో) పాదయాత్రగా వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు వీరికి అన్నిరకాల వసతులను కల్పించాం.
* భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా తాగునీరు, భోజన వసతులు, పార్కింగ్ ప్రదేశాలు, తాత్కాలిక విశ్రాంతి కేంద్రాలు, వైద్య శిబిరాలు తదితర సౌకర్యాల ఏర్పాటు.
* మహాశివరాత్రి రోజు పాకాల అంకరణకు అన్ని భద్రతా చర్యలు
* ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అందరికీ స్వామి, అమ్మవార్ల దర్శనం జరిగేలా పటిష్ట ఏర్పాట్లు.. CC కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ..
నంద్యాల జిల్లా:
పాతాళ గంగ వద్ద ఏర్పాటుచేసిన బందోబస్తును ఏర్పాట్లను పరిశీలన…..
మెట్ల మార్గం ద్వారా వెళ్లే భక్తులు జాగ్రత్తగా ఉండాలి….
నదిలో బోటు నడిపే నిర్వాహకులు తప్పనిసరిగా భద్రత ప్రమాణాలు పాటించాలి…..
ప్రయాణికులు తప్పనిసరిగా లైఫ్ జాకెట్ వేసుకోవాలి….
నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు…
-జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్
మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలంలో పాతాళగంగ పరిసర ప్రాంతాలలో ఏర్పాటుచేసిన బందోబస్తును జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పాతాళగంగ మెట్ల మార్గం ద్వారా స్వయంగా పర్యటిస్తూ సంబంధిత అధికారులకు నిర్వహించవలసిన విధులపై పలు సూచనలు చేసారు.
పుణ్యస్నానాలు ఆచరించే ప్రదేశం వరకు చేరుకున్న అనంతరం అక్కడ విధులు నిర్వహిస్తున్న అధికారులతో మాట్లాడుతూ భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నందున మెట్ల మార్గం ద్వారా భక్తులు జాగ్రత్తగా వెళ్లాలని , పుణ్యస్నానాలు ఆచరించు భక్తులు అధికారులు ఏర్పాటు చేసిన భద్రతా నిబంధనలు ఉల్లంఘించి ముందుకు వెళ్లరాదని శబ్ద యంత్రం (మైక్)ద్వారా భక్తులకు తెలియజేయాలన్నారు.
బోట్ల ద్వారా ప్రయాణికులను విహార యాత్రకు తీసుకువెళ్లే బోటు నిర్వాహకులు తప్పనిసరిగా భద్రతా ప్రమాణాలు పాటించాలి.
ప్రతి ఒక్క ప్రయాణికుని భద్రత ,రక్షణ దృష్టిలో ఉంచుకోవాలి. లైఫ్ జాకెట్ వేసుకున్న తర్వాతనే ప్రయాణం చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
.
