
శ్రీశైల క్షేత్రంలో గంగాధర మండపం నుండి నంది సర్కిల్ వరకు స్వామివారు ఊరేగింపు జరిగే ప్రాంతాలలో పర్యటించి, రోడ్డుకు ఇరువైపులా ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని, రోడ్డుకు ఇరువైపులా స్ట్రీట్ వెండర్స్ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ IPS ఆదేశించారు.
అనంతరం దాసరి సత్రం వద్ద ట్రాఫిక్ పాయింట్ ను సందర్శించి ట్రాఫిక్ అంతరాయం లేకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని పలు సూచనలు చేసారు.
టోల్గేట్ వద్ద వాహనాల రాకపోకలను పరిశీలించి పలు వాహనాలను తనిఖీ సారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తో పాటు డీఎస్పీలు రామంజి నాయక్, శ్రీనివాస రెడ్డి, శ్రీనివాస్ ఇన్స్పెక్టర్ లు పాల్గొన్నారు.
