శ్రీశైల దేవస్థానం:
ఫిబ్రవరి 8 నుండి 18 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్న సందర్భముగా శుక్రవారం శ్రీ భ్రమరాంబికా సేవా సమితి, చీరాల వారు అన్నప్రసాద వితరణ విభాగానికి లక్ష విస్తరాకులను విరాళంగా అందజేశారు.
వీరు అన్నపూర్ణా భవనం లో సహాయ కార్యనిర్వహణాధికారి, పర్యవేక్షకుల సమక్షంలో వీటిని అందించారు.
ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఈ విస్తరాకులను సమర్పించామన్నారు. వీటి విలువ రూ. 3,00,000/-లకు పైగా ఉంటుందని దాతలు తెలిపారు.
గత కొన్ని సంవత్సరాలుగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో వీరు విస్తరాకులను అందిస్తున్నారు.
ఈ కార్యక్రమములో భ్రమరాంబికా సేవా సమితి అధ్యక్షురాలు శ్రీమతి యం.వి. మహాలక్ష్మీ, పలువురు సేవా సమితి ప్రతినిధులు, శివ సేవకులు పాల్గొన్నారు.
