నంద్యాల జిల్లా:
నంద్యాల జిల్లా శ్రీశైలం లో జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి దర్శనం నిమిత్తం వచ్చే భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని వారికి ఎలాంటి ఆటంకాలు, అవాంఛనీయ సంఘటనలు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ పోలీస్ అధికారులను ఆదేశించారు.
జిల్లా ఎస్పీ సంబంధిత పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు . భక్తులకు ట్రాఫిక్ అంతరాయం లేకుండా తీసుకునే చర్యలలో భాగంగా శ్రీశైలం లో పార్కింగ్ ప్రదేశాలను , రింగ్ రోడ్డు వద్ద పార్కింగ్ ప్రదేశాలను,RTC బస్టాండ్, సాక్షి గణపతి, హటకేశ్వరం ,సుండిపెంట గ్రామం లోని లింగాల గట్టు మొదలగు ప్రదేశాలలో స్వయంగా పర్యటించి ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, లింగాలగట్టు స్నానఘాట్ లను కూడా పరిశీలించి సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు.
జిల్లా ఎస్పీ మాట్లాడుతూ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి దర్శనం నిమిత్తం వచ్చే భక్తులు పోలీసు వారి సూచనలను పాటిస్తూ తమ వాహనాలను ఇతరులకు ఆటంకం లేకుండా పార్కింగ్ చేసుకోవాలని,రోడ్డుకు ఇరువైపులా ఎట్టి పరిస్థితుల్లో పార్కింగ్ చేయరాదని విజ్ఞప్తి చేశారు.
