సంప్రదాయ నృత్యప్రదర్శనలు

శ్రీశైల దేవస్థానం:ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) శనివారం  సహస్ర ఆర్ట్సు నేషనల్ అకాడమీ, తిరుపతి వారు  సంప్రదాయ నృత్యప్రదర్శన కార్యక్రమం సమర్పించారు.

ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద  సాయంకాలం నుండి ఈ సంప్రదాయ నృత్య కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమములో వినాయక కౌత్వం, శివస్తుతి, శివకైవారం, ఓం నమ:శివాయ శివాయ నమ తదితర గీతాలకు పూజావసంత, నిహారిక, హేమశ్రీ, దేవజ్ఞ, భవిష్య తదితరులు నృత్య  ప్రదర్శన చేశారు.

 రెండవ కార్యక్రమములో భాగంగా శ్రీ పి. రమ్య , బృందం, విశాఖపట్నం వారు  సంప్రదాయ నృత్యప్రదర్శన కార్యక్రమం సమర్పించారు.

ఈ నిత్య కళారాధనలో ప్రతిరోజూ హరికథ, బుర్రకథ, సంప్రదాయ నృత్యం, వాయిద్య సంగీతం, భక్తిరంజని లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి.

శ్రీస్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని , ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ నిత్యకళారాధన నిర్వహిస్తున్నారు.

print

Post Comment

You May Have Missed