శ్రీశైల దేవస్థానం:లోకకల్యాణంకోసం దేవస్థానం ఆదివారం రాత్రి శ్రీ స్వామిఅమ్మవార్లకు పల్లకీ ఉత్సవం నిర్వహించింది.ఈ పల్లకీ ఉత్సవం ప్రతి ఆదివారం, పౌర్ణమి , మూలా నక్షత్రం రోజులలో దేవస్థాన సేవగా (సర్కారి సేవగా) జరుపుతారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా అమ్మవారి ఆలయ ఆశీర్వచన మండపంలో లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవాసంకల్పాన్ని తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజ జరిపారు.
అనంతరం శ్రీ స్వామిఅమ్మవార్ల ఉత్సవ మూర్తులను పల్లకీలో వేంచేబు చేయించి శాస్త్రోక్తంగా షోడశోపచార పూజలు జరిపారు.
దేవస్థానం కార్యాలయములో లక్ష్మీపూజ :
దీపావళి పర్వదినాన్నిపురస్కరించుకుని దేవస్థానం కార్యాలయ భవనములో ఆదివారం సాయంత్రం లక్ష్మీపూజను నిర్వహించారు.
ఈ కార్యక్రమములో ముందుగా అర్చకస్వాములు, వేదపండితులు పూజాసంకల్పాన్ని పఠించారు. తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజ నిర్వహించారు. అనంతరం శాస్త్రోక్తంగా లక్ష్మీదేవిపూజ జరిపించారు. అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేసారు.
కార్యక్రమములో దేవస్థానం కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు దంపతులు, పలు విభాగాల యూనిట్ అధికారులు పాల్గొన్నారు.
