*ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలి
శ్రీశైల మహా పుణ్యక్షేత్రంలో శివరాత్రి రోజు నిర్వహించనున్న పాగాలంకరణ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ IPS , జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ IPS ప్రత్యక్షంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ పాగా అలంకరణ దర్శనం కోసం ఆహ్లాదకర వాతావరణం ఉండేలా ఏర్పాట్లు చెయ్యాలని,భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలి.క్యూ లైన్లను, భక్తుల రాకపోకల మార్గాలలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చెయ్యాలి.
ఒక పద్దతి ప్రకారం గుడి పరిసరాలలో భక్తులు ఉంటూ స్వామి అమ్మవార్ల దర్శనంతో పాటు పాగా అలంకరణ వీక్షించేలా చర్యలు తీసుకోవాలి.దర్శనార్థం వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సక్రమమైన మార్గదర్శకాలు, తాగునీటి సౌకర్యం, వైద్య సహాయం వంటి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంచాలి.
ప్రత్యేకంగా పాగాలంకరణ సమయంలో భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్నందున, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ ఏర్పాట్లు, భద్రతా , బందోబస్తు తదితర అంశాలపై సమన్వయంతో విధులు నిర్వహించాలి.భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు సిబ్బందిని నియమించి, నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు.
అదేవిధంగా కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పరిస్థితులను నిరంతరం పరిశీలిస్తూ అవసరమైన చోట అధికారులకు సూచనలు ఇవ్వాలి.
భక్తులు సంయమనం పాటిస్తూ అధికారుల సూచనలతో పాగా అలంకరణను వీక్షించాలని అనుసరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో కర్నూలు రేంజ్ డీఐజీ గారితో పాటు జిల్లా ఎస్పీ, సంబంధిత పోలీసు అధికారులు పాల్గొన్నారు.
ఏర్పాట్లను పరిశీలించిన దేవదాయ కమిషనరు:
మహాశివరాత్రి ఏర్పాట్లను ఈ రోజు దేవదాయ కమిషనరు కె. రామచంద్రమోహన్ పరిశీలించారు. ఆలయ ప్రాంగణం, క్యూలైన్లు మొదలైనవాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా పలు ఆదేశాలు జారీ చేశారు.
ఈ పరిశీలనలో చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ ఎస్.ఎస్. అజాద్ కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కమిషనరు మాట్లాడుతూ క్యూలైన్లలో ఎటువంటి తొక్కిసలాట లేకుండా ఉండేందుకుగాను పోలీస్‌శాఖ సమన్వయంతో తగు ఏర్పాట్లు ఉండాలన్నారు. తగినస్థాయిలో సెక్యూరిటీ సిబ్బందిని , శివసేవకులను ఏర్పాటు చేసుకోవాలన్నారు.
క్యూకాంప్లెక్స్‌లోనూ నిరంతరం అల్పాహారం, మంచినీరు, బిస్కెట్లు మొదలైనవాటిని అందజేస్తుండాలన్నారు. క్యూలైన్లలో కూడా నిరంతరం మంచినీటిని అందజేస్తుండాలన్నారు. క్యూలైనులో ఏర్పాటు చేయబడిన వాటర్ పాయింట్లకు నిరంతరం నీటిసరఫరా ఉండాలన్నారు.
క్యూలైన్లలో అవాంఛనీయ సంఘటనలు నిరోధించేందుకు , అత్యవసర సమయాలలో వినియోగించుకునేందుకు క్యూలైన్లలో ఏర్పాటు చేయబడిన అత్యవసర గేట్లు ( ఎమర్జెన్సీ ఎగ్జిట్ గేట్లు) సజావుగా పనిచేసేవిధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
అదేవిధంగా క్యూకాంప్లెక్స్‌లోని శౌచాలయాల శుభ్రతపట్ల ప్రత్యేకశ్రద్ధ కనబర్చాలన్నారు. అన్ని శౌచాలయాలలో కూడా ఎటువంటి అంతరాయం లేకుండా నిరంతరం నీటిసరఫరా ఏర్పాటు ఉండాలన్నారు.శివదీక్షా భక్తులకు ప్రత్యేక క్యూలైన్లలో కూడా మంచినీరు ఉండాలన్నారు.
కమిషనరు మాట్లాడుతూ భక్తులు అధికసమయం క్యూలైన్లలో వేచివుండకుండా త్వరితంగా ప్రసాదాలను అందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా భక్తులు ఇబ్బందులు పడకుండా ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
అదేవిధంగా ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్నప్రసాద వితరణ జరుగుతుండాలన్నారు. ఆయావంటకాలన్నీ రుచికరంగా ఉండేందుకు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు.
అన్నప్రసాదాలను స్వీకరించేందుకు వచ్చిన భక్తులు అధిక సమయం వేచివుండకుండా వుండేందుకు తగు చర్యలు చేపట్టాలని కూడా ఆదేశించారు. ఇందుకుగాను అన్నదాన మందిరంలోని ఆయా భోజనశాలలో తగు ముందస్తు ఏర్పాట్లు ఉండాలన్నారు.
అన్నప్రసాద వితరణ సమయములో సంబంధిత అధికారులు ప్రతి హాలులో కూడా అన్నప్రసాద వితరణ సజావుగా జరిగేటట్లు పర్యవేక్షిస్తుండాలన్నారు. ప్రతి హాలును కూడా ప్రత్యేకంగా సిబ్బందిలో ఒకరు నిరంతరం పర్యవేక్షిస్తుండాలన్నారు. అన్నదాన మందిరములో శుచీ శుభ్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలన్నారు. ఎప్పటికప్పుడు అన్నదాన మందిరాన్ని శుభ్రపరుస్తుండాలని సిబ్బందిని ఆదేశించారు.
క్షేత్ర పరిధిలో పారిశుద్ధ్యంపై కూడా ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలన్నారు. చెత్తాచెదారాలను ఎప్పటికప్పుడు తొలగించేవిధంగా పర్యవేక్షక సిబ్బంది తగు చర్యలు చేపట్టాలన్నారు. అన్ని శౌచాలయాలకు నిరంతరం నీటిసరఫరా ఉండేవిధంగా తగు ఏర్పాట్లు ఉండాలన్నారు. శౌచాలయాలు కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుండాలన్నారు.
ముఖ్యంగా సిబ్బంది అందరు కూడా భక్తులతో మర్యాదగా మెలగాలన్నారు. భక్తులు అడిగిన సమాచారాన్ని శివసేవకులు, సిబ్బంది ఓపికగా అందిస్తుండాలన్నారు.
ఆలయ సమాచార వ్యవస్థద్వారా నిరంతరం భక్తులకు సమాచారాన్ని తెలియజేస్తుండాలన్నారు.