శ్రీశైల దేవస్థానం:
ఫిబ్రవరి 8 నుంచి 18 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్న సందర్భంగా భక్తులకు సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఉత్సవాలకు వివిధ విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇందులో భాగంగా శుక్రవారం దేవస్థానం కార్యనిర్వ
హణాధికారి యం. శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు ఆలా అనిల్‌కుమార్, శ్రీమతి ఉప్పుటూరు సుబ్బలక్ష్మి దేవస్థాన ఇంజనీరింగ్ అధికారులతో కలిసి చంద్రవతి కల్యాణమండపాన్ని, శివదీక్ష భక్తుల క్యూలైన్లను, ఆలయ ప్రాంగణంలోని క్యూలైన్లను పరిశీలించారు.
హణాధికారి యం. శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు ఆలా అనిల్‌కుమార్, శ్రీమతి ఉప్పుటూరు సుబ్బలక్ష్మి దేవస్థాన ఇంజనీరింగ్ అధికారులతో కలిసి చంద్రవతి కల్యాణమండపాన్ని, శివదీక్ష భక్తుల క్యూలైన్లను, ఆలయ ప్రాంగణంలోని క్యూలైన్లను పరిశీలించారు.ఈ సందర్భoగా వారు మాట్లాడుతూ చoద్రవతి కల్యాణ మండప ప్రాంగణంలోని శౌచాలయాల నిర్వహణ పట్ల ప్రత్యేకశ్రద్ధ కనబర్చాలన్నారు. ముఖ్యంగా శౌచాలయాలు శుచీశుభ్రతలతో కూడి వుండాలన్నారు.
అవసరం మేరకు ఈ కల్యాణమండపం వద్ద మరిన్ని తాత్కాలిక శౌచాలయాలను కూడా ఏర్పాటు చేయాలన్నారు. ఎటువంటి అంతరాయం లేకుండా శౌచాలయాలకు నిరంతరం నీటి సరఫరా ఏర్పాటు ఉండాలన్నారు. అదేవిధముగా వీటిలోని విద్యుద్దీపాలు, ఫ్యాన్ల పనితీరును కూడా సరిచూసుకోవాలన్నారు.
చంద్రవతి కల్యాణమండపంలో శివదీక్షా భక్తలు వేచివుండే సమయాలలో తగినంత మేరకు మంచినీరు, అల్పాహార ఏర్పాట్లు ఉండాలన్నారు.
అనంతరం శివదీక్షా భక్తుల క్యూలైన్లను పరిశీలించారు. శివదీక్షా భక్తుల క్యూలైన్లలో కూడా నిరంతరం మంచినీరు, బిస్కెట్లు మొదలైన వాటిని అందజేస్తుoడలన్నారు. అలాగే క్యూలైన్లలోని అవసరమైన అన్నిచోట్ల కూడా అత్యవసర గేట్లను (ఎమర్జెన్సీ ఎగ్జిట్ గేట్స్) ఏర్పాటు చేయాలన్నారు.
ఆ తరువాత అన్ని ఆలయ ప్రాంగణంలోని క్యూలైన్లను పరిశీలించారు. అన్ని క్యూలైన్లు కూడా దృఢంగా ఉండాలన్నారు.
రద్దీ సమయాలలో క్యూలైన్లలో తొక్కిసలాట లేకుండా ఉండేoదుకు గాను తగిన స్థాయిలో సెక్యూరిటి సిబ్బందిని, శివసేవకులను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ విషయంలో ఇప్పటికే సిద్దం చేసిన ప్రణాళికను అనుసరించి క్యూలైన్లను నిర్వహించాలన్నారు.
క్యూకాంప్లెక్స్ , క్యూలైన్లలో నిర్దిష్ట ప్రదేశాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాటర్ పాయింట్లకు నీటిసరఫరా సజావుగా ఉండాలన్నారు.
అదేవిధంగా క్యూలైన్ల లో అవసరం మేరకు మరిన్ని వాటర్ పాయింట్లను ఏర్పాటు చేయాలన్నారు.
అనంతరం శ్రీస్వామి అమ్మవార్లకు వాహన సేవలు జరిగే అక్కమహాదేవి అలంకార మండపాన్ని పరిశీలించారు.
అన్నిచోట్ల కూడా విద్యుత్ షార్ట్ సర్యూట్ జరగకుండా అన్ని విద్యుత్ తీగలను క్షుణ్ణంగా పరిశీలించాలని అవసరమైనచోట్ల మరమ్మతులు చేయాలని ఆదేశించారు.
ఈ పరిశీలనలో ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లు పి. మురళీబాలకృష్ణ, యం. నరసింహారెడ్డి, సహాయ కార్యనిర్వహణాధికారులు కె. వెంకటేశ్వరరావు, బి.మల్లికార్జునరెడ్డి, నీటిసరఫరా , విద్యత్ విభాగాల ఇంఛార్జి డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లు పి.వి. సుబ్బారెడ్డి, పి.చంద్రశేఖరశాస్త్రి, ఎడిటర్ డా. సి. అనిల్ కుమార్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.
