శ్రీశైలదేవస్థానం:దేవస్థానం వైదిక కమిటీ వారి సూచన మేరకు ప్రతీ మాసములో వచ్చే ఆరుద్రా నక్షత్రం రోజున శ్రీస్వామిఅమ్మవార్ల స్వర్ణ రథోత్సవం నిర్వహించాలని నిర్ణయించారు. లోక కల్యాణార్థం ప్రతీమాసం ఈ స్వర్ణ రథోత్సవాన్ని నిర్వహిస్తారు.
9న ఆరుద్రా నక్షత్రాన్ని పురస్కరించుకుని ఉదయం ఈ స్వర్ణ రథోత్సవం నిర్వహిస్తారు. స్వర్ణ రథోత్సవం గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు, అక్కడి నుంచి తిరిగి గంగాధర మండపం వరకు జరుగుతుంది.
ఆరుద్రా నక్షత్రాన్ని పురస్కరించుకుని ముందుగా వేకువ జామున శ్రీస్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేషపూజలు జరుగుతాయి.
అనంతరం స్వర్ణరథోత్సవం నిర్వహిస్తారు.
భక్తులందరు కూడా ఈ స్వర్ణ రథోత్సవంలో పాల్గొని తరించగలరని దేవస్థానం కోరింది