
* ఓర్వకల్లు విమానాశ్రయంలో ఈనెల ఇరవై ఐదు తేదీన ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి కర్నూలు/ ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమం, పర్యటన ఏర్పాట్ల పై ఈ రోజు మధ్యాహ్నం (24-03-2021) న అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్. పాల్గొన్న జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ , అభివృద్ధి) రామ సుందర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ (ఆసరా ,సంక్షేమం) సయ్యద్ ఖాజా మోహిద్దీన్, కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ డీ.కే.బాలాజీ, నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి, జిల్లా అధికారులు.
*రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 25న ఉదయం కర్నూలు/ఓర్వకల్లు విమానాశ్రయం ప్రారంభోత్సవానికి రానున్న నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్, పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, జిల్లా ఎస్పీ డా.కె.ఫక్కీరప్ప, కర్నూల్ నగరపాలక సంస్థ బి.వై. రామయ్య విమానాశ్రయాన్ని సందర్శించి ఏర్పాట్లను సీఎం సెక్యురిటి అధికారులతో కలిసి పరిశీలించారు.*పాల్గొన్న జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ, అభివృద్ధి) రామ సుందర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ (సంక్షేమం) సయ్యద్ ఖాజా మోహిద్దీన్, కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ డీ.కే. బాలాజీ, ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ కైలాష్ మండల్, డిఆర్డీఏ పిడి శ్రీనివాసులు, డ్వామా పిడి అమర్నాథరెడ్డి తదితర జిల్లా అధికారులు.
————