హరితహారం రెండో విడత కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్‌రావు నల్లగొండ జిల్లాలోని గుండ్రాంపల్లిలో కదంబ మొక్కను నాటి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్ర ప్రజలకు హరితాభివందనాలు తెలిపారు. హరిత తెలంగాణ సాధన కోసం అందరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు. లక్షన్నర మొక్కలు ఒకేసారి నాటడం గొప్ప సాహసోపేతమని పేర్కొన్నారు. అందరూ ఉద్యమ స్ఫూర్తితో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.