శ్రీశైలం దేవస్థానం లో శాకాంబరి ఉత్సవం భక్తి శ్రద్దలతో , ఉత్సాహంగా జరిగింది . 40 రకాల ఆకుకూరలు , కూరగాయలు , వివిధ ఫలాలు 15 టన్నులకు పైగా వినియోగించారు.అమ్మవారి మూల మూర్తిని , ఉత్సవ మూర్తిని , ఆలయ ప్రాంగణంలోని రాజరాజేశ్వరి దేవి వారిని , గ్రామ దేవత అంకాళమ్మ మొదలైన దేవతా మూర్తులను చక్కగా అలంకరించారు. ఆలయ ప్రాంగణాన్ని, ధ్వజస్తంభాన్ని, సింహ మండపాన్ని అద్భుతంగా అలంకరించారు.ఆలయ నియమాల ప్రకారంగా పూజలు నిర్వహించారు .
* srisailam temple closed in the afternoon on the eve of chandra grahanam.