12 న శ్రీశైల గిరిప్రదక్షిణ

 శ్రీశైలదేవస్థానం:పౌర్ణమి సందర్భంగా 12న  శ్రీశైల గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని దేవస్థానం సాంప్రదాయ బద్ధంగా నిర్వహిస్తుంది.

సోమవారం  సాయంత్రం శ్రీస్వామిఅమ్మవార్ల మహామంగళహారతుల అనంతరం ఈ గిరిప్రదక్షిణ ప్రారంభవుతుంది. ఆలయ మహాద్వారం నుండి మొదలై ఈ ప్రదక్షిణ గంగాధరమండపం, అంకాళమ్మ ఆలయం, నందిమండపం, గంగాసదనం మీదుగా బయలు వీరభద్రస్వామి ఆలయం వద్దకు చేరుకుంటుంది.

బయలు వీరభద్రస్వామి ఆలయం నుండి అలంకారేశ్వర ఆలయం మీదుగా వలయరహదారిపైకి చేరుకుంటుంది. అక్కడి నుండి సారంగధర మఠం మీదుగా సాగి హేమారెడ్డి మల్లమ్మ మందిరం వద్దకు చేరుకుంటుంది. హేమారెడ్డి మల్లమ్మ మందిరం నుంచి మహిషాసురమర్ధిని, రుద్రాక్షమఠం, విభూతిమఠాల మీదుగా రుద్రవనంలోకి చేరుకుంటుంది.

రుద్రవనం నుంచి నందిమండపం వద్దకు రావడంతో ఈ గిరి ప్రదక్షిణ ముగుస్తుంది.

శ్రీశైలక్షేత్రములోని ప్రాచీనమఠాలను, ఆలయాలను భక్తులచేత దర్శింపజేయిస్తూ వారిలో భక్తిభావాలను మరింతగా పెంపొందింపజేయాలని, అదేవిధంగా క్షేత్రాన్ని ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దడంలో భాగంగా ఈ గిరిప్రదక్షిణను నిర్వహించడం జరుగుతోంది.గిరిప్రదక్షిణలో  భక్తులందరికీ ప్రదక్షిణానంతరం శ్రీస్వామివార్లదర్శనం కల్పిస్తున్నారు.

*సాంస్కృతిక కార్యక్రమాలు:

 ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) ఈ రోజు అండాళ్ కూచిపూడి నాట్యాలయ, హైదరాబాద్ వారిచే సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం నుండి ఈ సంప్రదాయ నృత్య కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమములో వినాయక కౌత్వం, మూషికవాహన, తాండవనృత్యకరి, నమశివాయతే, జతిస్వరం, శివతాండవం తదితర గీతాలకు లహరి, భూమిశ్రీ, భవానీ, విశిష్ట తదితరులు నృత్యప్రదర్శన చేశారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.