శ్రీశైల దేవస్థానం:మకర సంక్రమణ పుణ్యకాలాన్ని పురస్కరించుకుని పంచాహ్నిక దీక్షతో ఏడు రోజులపాటు జరిగే సంక్రాంతి బ్రహ్మోత్సవాలలో బుధవారం శ్రీ స్వామిఅమ్మవార్లకు విశేషపూజలు జరిగాయి.
యాగశాల లో శ్రీ చండీశ్వరస్వామికి ప్రత్యేక పూజాదికాలు జరిపారు. అనంతరం లోకకల్యాణంకోసం చతుర్వేద పారాయణలు, జపాలు, రుద్రపారాయణ చేశారు .
తరువాత మండపారాధనలు, పంచావరణార్చనలు, రుద్రహోమం కార్యక్రమాలు ఆగమశాస్త్రం ప్రకారంగా జరిగాయి.
సాయంకాలం ప్రదోష కాలపూజలను, హోమాలను జరిపించిన తరువాత జపానుష్టానాలు జరిపారు.
రావణ వాహన సేవ:
వాహనసేవలలో భాగంగా సాయంకాలం శ్రీ స్వామిఅమ్మవార్లకు రావణ వాహనసేవ నిర్వహించారు.
ఈ సేవలో శ్రీ స్వామిఅమ్మవారి ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో రావణవాహనంపై వేంచేపు చేయించి ప్రత్యేక పూజాదికాలు జరిపారు.
తరువాత పురవీధులలో గ్రామోత్సవం జరిగింది . గ్రామోత్సవములో జానపద కళారూపాల ప్రదర్శన, కోలాటం తదితర కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
16 న కార్యక్రమాలు:
ఉదయం శ్రీ స్వామిఅమ్మవార్లకు ప్రాత:కాల పూజల అనంతరం ఉదయం గం. 9.00ల నుండి శ్రీస్వామివారి యాగశాలలో పూర్ణాహుతి అవబృథం, కలశోద్వాసన, వసంతోత్సవం, మహదాశీర్వచనం, తీర్థప్రసాద వితరణ, విశేషార్చనలు జరుగుతాయి.
సాయంత్రం గం.6.00ల నుండి సదస్యమ్, నాగవల్లి, రాత్రి గం.7.30లకు ధ్వజావరోహణ కార్యక్రమాలు వుంటాయి.
*INSPECTION OF LADDU PRASADADM PREPARATION image
*Kanuma (GoPuja) Puja image