శాశ్వత అన్నప్రసాద పథకానికి విరాళం
Srisaila Devasthanam: Nandeeswara Pooja, Kumara swamy pooja , Bayalu veerabadra swamy pooja , Aaakaasha deepam puuja performed in the temple on 26th Nov.2024. Archaka swaamulu performed the events.
* దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) మంగళవారం ఎన్. వరలక్ష్మి కల్యాణి , బృందం, తెనాలి వారు భక్తి రంజని కార్యక్రమం సమర్పించారు.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద సాయంకాలం నుండి ఈ భక్తి రంజని కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమములో గణపతి కీర్తన, కాలభైరవాష్టకం, శ్రీశైల శివమయం, ఓంకారనాదం, శంకరా శశిధర, శ్రీచక్రరాజ సింహాసనే మొదలైన పలు కీర్తనలను ఎన్.వి.ఎల్. కల్యాణి తదితరులు ఆలపించారు.ఈ కార్యక్రమానికి కీబోర్డు సహకారాన్ని పెద్దిరాజు అందించారు.
రెండవ కార్యక్రమములో భాగంగా కృష్ణవేణి కళానిలయం, హైదరాబాద్ వారు సంప్రదాయ నృత్యప్రదర్శన కార్యక్రమం సమర్పించారు.
నిత్య కళారాధనలో ప్రతిరోజూ హరికథ, బుర్రకథ, సంప్రదాయ నృత్యం, వాయిద్య సంగీతం, భక్తిరంజని లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి.
శ్రీస్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని, ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ నిత్య కళారాధన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
*శాశ్వత అన్నప్రసాద పథకానికి విరాళంగా రూ. 1,10,116/-లను వడ్డే విశ్వనాథ్, కర్నూలు అందజేశారు. ఈ మొత్తాన్ని సహాయ కార్యనిర్వహణాధికారి జి.స్వాములుకు అందించారు. దాతకు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం ఇచ్చారు.
Post Comment