వారాంతపు రోజులలో గణేశ సదన్ నుండి క్యూ కాంప్లెక్స్ వరకు ఉచిత బస్సులను ట్రాన్స్ పోర్ట్ విభాగం ద్వారా ఏర్పాటుకు నిర్ణయం
శ్రీశైల దేవస్థానం: శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి వార్ల దర్శనార్థం దేశ నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో వాహనముల ద్వారా శ్రీశైలం వస్తున్నారు. ప్రధానంగా మహాశివరాత్రి, ఉగాది ,బ్రహ్మోత్సవాలు, సంక్రాంతి, శ్రావణ మాసం, వినాయక చవితి, దసరా, కార్తీక మాసం వంటి పర్వదినాలలో , వారాంతపు రోజులలో భక్తులు లక్షలాది సంఖ్యలో వస్తున్నారు. భక్తుల వాహనాలను ట్రాఫిక్ నియంత్రణ దృష్ట్యా ఔటర్ రింగ్ రోడ్డు పార్కింగ్ ప్రదేశాలకు తరలిస్తారు.
భక్తుల సౌకర్యార్ధమై వారాంతపు రోజులలో , ప్రతి శుక్రవారం సాయంత్రం 5.00 గంటల నుండి సోమవారం మధ్యాహ్నం 2.00 గంటల వరకు ( ప్రతి అరగంటకు ఒక పర్యాయం ) గణేశ సదన్ నుండి అన్నదాన భవనం మీదుగా క్యూ కాంప్లెక్స్ (డొనేషన్ కౌంటర్) వరకు భక్తులను చేరవేయటానికి ఉచిత బస్సులను ఏర్పాటు చేయవలసిందిగా ట్రాన్స్ పోర్ట్ విభాగం ఇంచార్జ్
వారిని ఈ ఓ ఆదేశించారు.
Post Comment