జ్ఞానపీఠ అవార్డు గ్రహిత మహాశ్వేతాదేవి మరణం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. భారత దేశం గర్వించదగిన మహోన్నత రచయిత్రిగా ఆమెకు చరిత్రలో స్థానం ఉందన్నారు. భారత దేశంలో ఆదివాసి జీవితాలను సాహిత్యంలో ప్రతిఫలింప చేసిన రచయిత్రిగా ఆమె పేరు గడించారన్నారు. మహాశ్వేతాదేవి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.