
శ్రీశైల దేవస్థానం:చంద్రవతి కల్యాణ మండపంలో నిన్న ప్రారంభించిన యోగశిక్షణా కార్యక్రమము బుధవారం కొనసాగింది.వారంలో రెండు రోజులపాటు ప్రతీ మంగళ, బుధవారాలలో ఈ యోగశిక్షణా కార్యక్రమం వుంటుంది . సిబ్బంది, స్థానికులు ,యాత్రికుల సౌకర్యార్థం ఈ శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశారు.
మనరాష్ట్రంతో పాటు తెలంగాణా, కర్ణాటక రాష్ట్రాలలో యోగా శిక్షణను ఇచ్చిన ప్రముఖ యోగా గురువు యోగాచార్య గంధవళ్ళ బాలసుబ్రహ్మణ్యం, ఒంగోలు ఈ శిక్షణ ఇస్తున్నారు.
ఈనాటి శిక్షణా కార్యక్రమములో యోగాగురువు ఆయా అంశాలను వివరిస్తూ ముందుగా సూక్ష్మ వ్యాయామాన్ని చేయించారు. తరువాత భద్రాసనం, వజ్రాసనం, ఉష్ట్రాసనం శశాంకాసనం, మండూకాసనం, మొదలైన ఆసనాలు వేయించారు.
ఆయా ఆసనాల విశేషాలను, ప్రయోజనాలను వివరిస్తూ యోగాచార్యులు, శిక్షకులు పలు యోగాసనాలను సాధకుల చేత చేయించారు. ఈనాటి శిక్షణ కార్యక్రమానికి 220 మంది హాజరయ్యారు.