
శ్రీశైల దేవస్థానం: ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) గురువారం రాగరమ్య కల్చరర్ ఆర్గనైజేషన్, హైదరాబాద్ వారు సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పించారు.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం నుండి ఈ సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమం లో మహాగణపతిం, మూషికవాహన, శివతాండవం, శివస్తుతి, భో… శంభో, శంభోశంకర, గంగాధర శంకరా తదితర గీతాలకు మంజుల, శివాని, ఇందుశ్రీ, సహస్ర, వేదాంశి సంజన తదితరులు నృత్య ప్రదర్శన చేశారు.
ఈ నిత్య కళారాధనలో ప్రతిరోజూ హరికథ, బుర్రకథ, సంప్రదాయ నృత్యం, వాయిద్య సంగీతం, భక్తిరంజని లాంటి కార్యక్రమాలు ఏర్పాటు వుతున్నాయి. శ్రీ స్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని , ప్రాచీన కళల పరిరక్షణలో భాగంగా ఈ నిత్య కళారాధన సంప్రదాయ కార్యక్రమాలు జరుగుతున్నాయి.