బిజెపి రాష్ట్ర కార్యాలయంలో చాకలి ఐలమ్మ వర్ధంతి జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బిజెపి నేషనల్ ఎగ్జిక్యూటివ్ నాగం జనార్ధన్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి, మహిళా మోర్చా గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షురాలు బండారు రాధిక, అరుణ జ్యోతి, దాసరి మల్లేషం, మహిళా మోర్చా నేతలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిజాంకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ చేసిన పోరాటాన్ని స్మరించుకున్నారు.