ఈనెల 7న రాష్ట్రానికి ప్రధాని పర్యటనకు ఏర్పాట్లు పూర్తి – నీటి పౌరుదల శాఖా మంత్రి శ్రీ హరీష్ రావు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రధాని హోదాలో నరేంద్రమోడీ తొలిసారిగా ఈ నెల 7న రాష్ర్టానికి వస్తున్నారని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్రావు తెలిపారు.
ప్రధాని పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశామని స్పష్టం చేశారు. మోడీ రాష్ర్టానికి రావడం సంతోషంగా ఉందన్నారు. ప్రధానికి అత్యంత ఘనంగా స్వాగతం పలుకుతామని చెప్పారు.
మిషన్ భగీరథను ప్రధాని చేతులమీదుగా ప్రారంభం చేసుకుంటామని పేర్కొన్నారు. 1200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ను మోడీ జాతికి అంకితం చేస్తారని తెలిపారు. రామగుండం ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీని ప్రధాని, సీఎం కేసీఆర్ పునఃప్రారంభం చేస్తారు అని వెల్లడించారు. కొత్తపల్లి – మనోహరబాద్ రైల్వేలైన్కు ప్రధాని శంకుస్థాపన చేస్తారని చెప్పారు.
మిషన్ భగీరథ పైలాన్ నిర్మాణం పూర్తైందన్నారు. మొత్తం మూడు వేదికలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రధాని వేదిక మీద 18 మంది అతిథులు కూర్చునేలా ఏర్పాట్లు చేశామని ప్రకటించారు.
2 లక్షల మంది కూర్చునే విధంగా బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. నాలుగు హెలిప్యాడ్లు సిద్ధం చేస్తున్నాం, 170 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. బహిరంగ సభ ప్రాంగంణలో అడుగడుగునా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు.
ప్రధాని సభను విజయవంతం చేసేందుకు అధికారులు సమన్వయంతో పని చేస్తున్నారని కొనియాడారు. ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.
ప్రెస్ మీట్:
-మిషన్ భగీరథ పై ప్రధాని కి ఇచ్చిన లేఖను కాంగ్రెస్ వెనక్కి తీసుకోవాలి.
-మిషన్ భగీరథ పై కాంగ్రెస్ దుష్పచారం చేస్తుంది.
-ప్రజలు తిరస్కరించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ.
-ప్రధానికి కోమటిబండ లో ఘన స్వాగతం పాలుకుతాము.