మూడు రోజుల పర్యటన నిమిత్తం సింగపూర్ చేరుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సింగపూర్ తెలుగు అసోసియేషన్ ప్రతిధులు ఘన స్వాగతం పలికారు .
అమరావతి నిర్మాణానికి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తమ శక్తి మేరకు సహాయ సహకారాలు అందిస్తామని ముఖ్యమంత్రికి తెలిపిన సింగపూర్ తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు. మీ వంటి నాయకుడు ప్రపంచ నగరాల సదస్సుకు హాజరు కావడం తెలుగు వారందరికీ గర్వకారణం అని సింగపూర్ లోని తెలుగు వారు పేర్కొన్నారు .