కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ని ఢిల్లీలో కలిసి క్యాబినెట్ అడ్వైసరి బోర్డు ఆన్ ఎడ్యుకేషన్ (CABE) రిపోర్ట్ ని సమర్పించిన CABE సబ్ కమిటీ చైర్మన్ , తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి..కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన CABE రిపోర్ట్ ను కేంద్ర మంత్రికి అందజేశాం,బాలికల విద్యా, విద్యా ప్రమాణాల పెంపు, బాలికల డ్రాపవుట్లపై రిపోర్ట్ లో పొందుపరిచాం.కేజీబివిల లో ఇంటర్ మీడియట్ విద్యా సంవత్సరాన్ని ఈ ఏడాది నుంచి ప్రారంభిస్తున్నారు,6 వ తరగతి నుంచి 12 వ తరగతి వరకు ఒకే విద్యా విధానం ఉండదు.ఇంటర్ విద్యా నిర్వాహణకు టీచర్ల పెంపు చేయాలని కేంద్ర మంత్రికి సూచించాం.ఈ సందర్భంగా విద్యలో తెలంగాణ ప్రభుత్వం విధానాన్ని కేంద్ర మంత్రికి వివరించాం.నాణ్యమైన విద్య అందించాలంటే అర్హులైన టీచర్లను ఏర్పాటు చేయాలని సూచించాం.కేజీబివి లకు డార్మెట్రి, తరగతి గదుల ఏర్పాటు కు నిధులు ఇవ్వాలని కోరాం.కేంద్ర ప్రభుత్వం కోటి 50 లక్షలు ఇస్తామని చెబుతుంది. దాదాపు 7 కోట్ల 50 లక్షలు ఇవ్వాలని కోరాం.475 కేజీబివిలలో 94 కేజీబీవీ ల ఆధునీకరణ కు అవకాశం ఇచ్చారు. వీటి సంఖ్య పెంచాలని కోరాం.బాలికలకు జిల్లా పరిషత్, ప్రభుత్వం పాఠశాలలు, గురుకుల పాఠశాల లో చదువుతున్న బాలికలకు సంవత్సరానికి లక్ష రూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు.*100 కోట్ల రూపాయల తో 8 లక్షల ఆడపిల్లలకు హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ ను ఇవ్వబోతున్నాం*దాదాపు 13 రకాల 50 బ్రాండెడ్ వస్తువులను ఇందులో అందిస్తున్నాం.*ఈ విధానాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేయాలని కేంద్ర మంత్రి ని కోరాం*ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థి కి పోషక విలువలతో కూడిన ఆహారపట్టికను రూపొందించి అమలు చేస్తున్నాం. ఈ విధానంతో విద్యార్థులలో హెమోగ్లోబిన్ శాతం పెరిగింది.బాలికలు మరింత ఉత్సాహం తో, ఆరోగ్యంగా ఉన్నారు.
జూనియర్ కాలేజిగా మార్చే ప్రతి కేజీబివిలకు 7 కోట్ల 50 లక్షలు కేటాయించాలని కోరాం.
————————-
వరంగల్ జిల్లా మామునూరు లో ప్రభుత్వ పశు వైద్య కళాశాల లో కోర్సుల ప్రారంభానికి నేషనల్ వెటర్నరీ కౌన్సిల్ డైరెక్టర్ కరుణ్ శ్రీధర్ అంగికరించారు.
తెలంగాణ ఎంసెట్ ద్వారా మొదటి సంవత్సరం లో 50 సీట్ల కు ప్రవేశాలను కల్పిస్తాం.*టెక్ మహింద్ర సంస్థ అధినేత ఆనంద మహేంద్ర ఇంజనీరింగ్ కళాశాల ప్రమాణాలపై చేసిన కామెంట్ల లో వాస్తవం ఉంది*ఇంజనీరింగ్ విధానాన్ని పటిష్ఠం చేయాల్సిన అవసరం ఉంది.*రాష్ట్ర ఏర్పాటు తర్వాత విద్యా ప్రమాణాల్లో చాలా మార్పులు తెచ్చాం*విద్యార్థుల కన్నా ఇంజనీరింగ్ కళాశాలలు ఎక్కువగా ఉండేవికాని మా ప్రభుత్వం చాలా వరకు విద్యా రంగంలో ప్రక్షాళన చేసింది.సామర్థ్యాన్ని మించి పిల్లలపై చదువుపై ఒత్తిడి పెంచకూడదు