వనస్దలిపురం పోలీసు స్టేషన్ పరిధి, మన్సూరాబాద్ శ్రీరామ్ హిల్స్ కాలనీలోని శివ సాయి స్టోర్సులో ₹ 3లక్షల 80 వేలు చోరీ జరిగింది . షాప్ పైన ఉన్న రేకులను కత్తిరించి లోపలికి వెళ్ళి నగదును దొంగలు ఎత్తుకుపోయారు . షాప్ యజమాని రఘు రామయ్య ఫిర్యాదు మేరకు సి.సి .ఫుటేజ్ ల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు .