శ్రీశైలదేవస్థానంలో  అంకాళమ్మ అమ్మవారికి విశేష పూజలు 

 శ్రీశైలదేవస్థానం: లోక కల్యాణం కోసం శ్రీశైల క్షేత్ర గ్రామ దేవత  శ్రీ అంకాళమ్మ అమ్మవారికి ఈ రోజు 17 న  ఉదయం అభిషేకం, విశేష పూజలను నిర్వహించారు.ప్రతి శుక్రవారం  శ్రీఅంకాళమ్మ అమ్మవారికి దేవస్థానం సేవగా (సర్కారిసేవగా) ఈ విశేషపూజ నిర్వహిస్తున్నారు.ఇందులో భాగంగా ఉదయం గం.6.30లకు శ్రీ అంకాళమ్మ అమ్మవారికి అభిషేకం, విశేష పుష్పాలంకరణ, విశేషపూజలు, కుంకుమార్చనలు నిర్వహించారు. కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు ముందుగా మహాగణపతిపూజ జరిపారు. ఆ తరువాత లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సంకల్పాన్ని పఠించారు.అనంతరం పంచామృతాభిషేకం, హరిద్రోదకం, కుంకుమోదకం, గంధోదకం, పుష్పోదకం పూజలను చేసారు. అర్చకస్వాములు భౌతికదూరాన్ని పాటిస్తూ ఏకాంతంగా ఊయల సేవ విశేషార్చనలను జరిపించారు.

ఊయల సేవ:

లోకకల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు  సాయంకాలం శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి ఊయల సేవను నిర్వహించింది.ప్రతి శుక్రవారం , పౌర్ణమి, మూలనక్షత్రం రోజులలో ఈ ఊయలసేవ ఉంటుంది. ఈ సాయంత్రం ఊయల సేవ  కార్యక్రమంలో  ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవా సంకల్పాన్ని  తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజ జరిగింది. ఊయలలో వేంచేబు చేయించిన శ్రీస్వామిఅమ్మవార్లకు  షోడశోపచార పూజ జరిగింది.ఆ తరువాత విశేషంగా అమ్మవారికి అష్టోత్తరం, త్రిశతి, ఖడ్గమాల, సహస్ర నామపూజలు, స్వామివారికి సహస్రనామార్చన పూజలు జరిగాయి. చివరగా ఊయల సేవ జరిపారు.

 

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.