దివ్యదర్శనం కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా జలదంకి, ప్రకాశం జిల్లా గుడ్లూరు ప్రాంతాలకు చెందిన భక్తులు శ్రీశైల క్షేత్రం సందర్శించారు. దేవస్థానం వారు భక్తులకు పలు సౌకర్యాలు కల్పించారు .ఆలయ రాజగోపురం వద్ద భక్తులకు అధికారులు ,అర్చక స్వాములు సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. భక్తులు స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకున్నారు.వేద ఆశీర్వచనం అనంతరం భక్తులకు ప్రసాదం అందించారు .