శ్రీశైలం మహాక్షేత్రంలో ఆదివారం శాస్త్రోక్తంగా గోపూజ నిర్వహించారు. దేవస్థానం అర్చక స్వాములు, భక్తులు ఈ కార్యక్రమంలో శ్రద్ధగా పాల్గొన్నారు. దేవస్థానం పరిధిలోని శ్రీ గోకులం పూజశాలలో ఘనంగా ఈ కార్యక్రమం జరిగింది. ఆలయ సంప్రదాయం ప్రకారం గోవుకు పూజ చేసారు. గోశాలలోని 11 గోవులకు , 11 ఆవుదూడలకు పూజలు జరిపారు . ముందుగా మహాగణపతి పూజ జరిపారు. వేదపండితులు , అర్చకులు సంకల్పం చేసారు. శ్రీసూక్తంతోను, గోఅష్ట్తోతర మంత్రంతోను గోవులకు షోడశ ఉపచారాలతో పూజలు జరిపారు .గోవులకు వస్త్రాలు , పుష్పమాలలు సమర్పించారు.వేదపారాయణాలు జరిగాయి. గోవులకు నివేదన , మంత్ర పుష్పాలు సమర్పించారు.