శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శివరాత్రి నాడు రాత్రి 12 గంటలకు శ్రీ స్వామి అమ్మవార్లకు కన్నులవిందుగా కల్యాణం జరిగింది . సంప్రదాయంగా ఈ వేడుకను నిర్వహించారు .పెండ్లి కుమారుడిని , వధువును సరిజోడుగా అలంకరించారు . వేద మంత్రాలు , మంగళ వాయిద్యాల నడుమ కల్యాణం ఉత్సాహంగా , మనోహరంగా జరిగింది .