శ్రీశైలం: శ్రీశైల దేవస్థానంలో శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి పల్లకీసేవ
లోకకల్యాణం కోసం శ్రీశైల దేవస్థానంలో ఈ రోజు (08.03.2020) రాత్రి శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి పల్లకీ ఉత్సవం జరిపించారు.
ఈ పల్లకీ ఉత్సవం ప్రతి ఆదివారం, పౌర్ణమి మరియు మూల నక్షత్రం రోజులలో (సర్కారి సేవగా) జరిపించబడుతోంది.
ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవా సంకల్పాన్ని పఠిస్తారు. తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజ జరిపించబడుతుంది.
అనంతరం శ్రీ స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు శాస్తోక్తంగా షోడశోపచారపూజలు జరిపించబడుతాయి. తరువాత శ్రీ స్వామిఅమ్మవార్లకు పల్లకీలో వేంచేబు చేయించి పల్లకీ ఉత్సవం నిర్వహించబడుతుంది
ఈ ఉత్సవములో శ్రీస్వామిఅమ్మవార్లను వేంచేబు చేసే పనికి వివిధ రకాల పుష్పాలతో అలంకరించబడుతుంది.
కాగా ఈ పల్లకీ ఉత్సవ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొనేందుకు దేవస్థానం అవకాశాన్ని కల్పించడం జరిగింది.